2024లో బెస్ట్ 7 ప్రొడక్టివిటీ యాప్స్ | Best Productive Apps For Students
ప్రస్తుతం మనం ఉన్న ఈ బిజీ ప్రపంచంలో ప్రతి ఒక్కరికీ సమయం చాలా ముఖ్యమైంది. అందుకే, మన పనులను సమర్ధవంతంగా నిర్వహించుకోవడానికి ప్రొడక్టివిటీ యాప్స్ ఉపయోగపడతాయి. ఇవి మన రోజువారీ పనులు, ప్రాజెక్టులు, కమ్యూనికేషన్ వంటి విషయాలను చాల ఈజీ గా చేస్తాయి. 2024లో మనకు అందుబాటులో ఉన్న ప్రొడక్టివిటీ యాప్స్ చాలా ఉపయోగకరమైనవి. ఈ ఆర్టికల్‌లో 2024లో అత్యుత్తమమైన 7 ప్రొడక్టివిటీ యాప్స్ గురించి తెలుసుకుందాం. వీటితో మీ పనులను సమయానికి పూర్తి చేసుకోవడం, మరింత సమర్ధవంతంగా చేయడం ఎలా అనేది తెలుసుకుంటారు . ఈ యాప్స్ ప్రతి ఒక్కరి జీవితంలో ఎలా ప్రభావం చూపిస్తాయో, ఎలా ఉపయోగపడతాయో అవన్నీ మనం ఇపుడు చూద్దాం.
- Todoist
TODOIST అనేది టాస్క్ మేనేజ్‌మెంట్ యాప్, ఇది మన పనులు చాల చక్కగా నిర్వహించడంలో ఎంతో సహాయపడుతుంది. ఈ యాప్‌లో నువ్వు ఏ పనిని చేయాలనుకుంటున్నావో సింపుల్‌గా టైప్ చేసి, ఏ టైమ్కి ఆ పని చేయాలో సెట్ చేసుకోవచ్చు. TODOIST ద్వారా మీరు డైలీ, వీక్లీ, మంత్లీ టాస్క్స్ కూడా సెట్ చేసుకోవచ్చు. ఇంకా రిమైండర్స్, ప్రాజెక్ట్స్ మేనేజ్‌మెంట్, ప్రొడక్టివిటీ ట్రాకింగ్ వంటి ఫీచర్లు కూడా అందుబాటులో ఉంటాయి. అంతే కాదు, ఈ యాప్‌ను మనం మన టీమ్‌తో కలిపి వాడుకోవచ్చు. TODOIST యాప్‌తో మీ పనులు సమయానికి పూర్తి చేయడం చాలా ఈజీగా గ ఉంటుంది.
- NOTION (Notion)
NOTION అనేది ఒక ఆల్-ఇన్-వన్ వర్క్‌స్పేస్, ఇందులో నోట్స్ తీసుకోవడం, టాస్క్స్ మేనేజ్ చేయడం, డేటా స్టోర్ చేయడం వంటివి అన్ని ఒకేచోట చేయొచ్చు. ఈ యాప్‌తో నీవు టేబుల్స్, డాటాబేసెస్, కాంబినేషన్ ఫార్మాట్‌లో డాక్యుమెంట్స్ క్రియేట్ చేయవచ్చు. NOTION అనేది ఫ్లెక్సిబుల్ టూల్ కాబట్టి, దీనిని మీరు పర్సనల్ గా లేదా టీమ్ ప్రాజెక్ట్స్ మేనేజ్ చేయడంలో ఉపయోగించవచ్చు. ఇది మీ కంటెంట్‌కి ఒక స్ట్రక్చర్డ్ మరియు ఆర్గనైజ్డ్ విధానం అందిస్తుంది. NOTION ద్వారా మీరు అనేక రకాల టాస్క్స్‌ను ఈజీ గా నిర్వహించవచ్చు మరియు మీ పనులను చేసుకోవచ్చు .
- Evernote
EVENOTE అనేది నోట-taking యాప్, ఇది మీ ఐడియాస్, టాస్క్స్, ప్రాజెక్ట్స్ అన్ని ఒకే చోట స్టోర్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇందులో టెక్స్ట్ నోట్స్, ఆడియో నోట్స్, ఫోటో నోట్స్ తీసుకోవచ్చు. మీ ఆలోచనలు ఎప్పుడు, ఎక్కడైనా క్యాప్చర్ చేసుకోవచ్చు. అంతే కాకుండా, ఎవర్‌నోట్‌లో ట్యాగ్స్, నోటీబుక్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి, ఇవి మీ నోట్స్‌ను కేటగరైజ్ చేయడంలో సహాయపడతాయి. ఈ యాప్ క్లౌడ్ బేస్డ్ కాబట్టి, మీ నోట్స్ అన్ని డివైసెస్‌లో సింక్ అవుతాయి. ఎవర్‌నోట్ ద్వారా మీరు మీ ఆలోచనలు మరియు పనులను సులభంగా చేసుకోవచ్చు .
- Trello
TRELLO అనేది ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ టూల్, ఇది మీ పనులను విజువలైజ్ చేయడంలో చాలా సహాయపడుతుంది. ఈ యాప్‌లో బోర్డ్స్, కార్డ్స్, లిస్ట్స్ రూపంలో మీ టాస్క్స్, ప్రాజెక్ట్స్ మేనేజ్ చేయవచ్చు. ప్రతి పనికి డీడ్లైన్లు, రిమైండర్లు సెట్ చేయొచ్చు. TRELLO టీమ్‌ప్రాజెక్ట్స్‌కు చాలా బాగా సరిపోతుంది. ఇందులో డ్రాగ్ అండ్ డ్రాప్ ఫీచర్ ద్వారా టాస్క్స్‌ను సులభంగా షిఫ్ట్ చేయవచ్చు. TRELLO యాప్‌తో మీరు మీ ప్రాజెక్ట్స్‌ను చక్కగా చేయచ్చు , సమర్ధవంతంగా నిర్వహించవచ్చు. ఇది మీ టీమ్‌తో కలిపి పని చేయడం అలాగే సులభం చేస్తుంది.
- Slack
SLACK అనేది కమ్యూనికేషన్ యాప్, ఇది టీమ్‌మెంబర్స్‌తో ఎఫెక్టివ్ కమ్యూనికేట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఈ యాప్‌లో చాట్స్, కాల్స్, ఫైల్స్ షేర్ చేసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది. స్లాక్‌లో చానల్స్ అనే ఫీచర్ ఉంది, దీనివల్ల టీమ్‌లు ప్రత్యేక చానల్స్‌లో కమ్యూనికేట్ చేసుకోవచ్చు. SLACK యాప్‌తో ఇన్ఫోర్మేషన్ ట్రాక్ చేయడం, క్విక్ ఫీడ్బాక్ పొందటం చాలా సులభం. SLACK ద్వారా మీరు మీ టీమ్ సభ్యులతో సులభంగా కమ్యూనికేట్ చేయవచ్చు, ఏ సమస్యను అయినా కూడా త్వరగా సాల్వ్ చేసుకోవచ్చు.
- Timer 42
TIMER 42 అనేది టైమ్ మేనేజ్‌మెంట్ యాప్, ఇది మీ పనులకు టైమ్ సెట్ చేయడంలో సహాయపడుతుంది. ఈ యాప్‌తో మీరు మీ పనుల కోసం బ్రేక్స్ సెట్ చేయవచ్చు. పోమోడోర్ టెక్నిక్ ఉపయోగించి మీరు 25 నిమిషాల పని, 5 నిమిషాల బ్రేక్ విధానంలో పని చేయవచ్చు. TIMER 42 ద్వారా మీరు మీ పనిని సమర్ధవంతంగా నిర్వహించవచ్చు. ఈ యాప్ పనిని ప్రొడక్టివిటిగా చేయడంలో చాలా ఉపయోగపడుతుంది. TIMER 42 యాప్‌తో మీరు టైమ్ మేనేజ్‌మెంట్ నేర్చుకోవచ్చు, మీ ప్రొడక్టివిటీని పెంచుకోవచ్చు.
- RescueTime
RESCUE TIME అనేది టైమ్ ట్రాకింగ్ యాప్, ఇది మీరు రోజుకు ఎంత టైమ్ ఏ యాక్టివిటీల మీద ఖర్చు చేస్తున్నారో ట్రాక్ చేస్తుంది. ఈ యాప్ ద్వారా మీరు ఇంటర్నెట్, యాప్స్ మీద మీరు ఎంత టైమ్ వెచ్చిస్తున్నారో తెలుసుకోవచ్చు. RESCUE TIME యాప్ మీకు ప్రొడక్టివిటీ రిపోర్ట్స్ కూడా అందిస్తుంది. ఈ రిపోర్ట్స్ ఆధారంగా మీరు మీ టైమ్‌ని సరిగా ప్లాన్ చేసుకోవచ్చు. RESCUE TIME యాప్ ద్వారా మీరు మీ టైమ్ మేనేజ్‌మెంట్‌ను మెరుగుపరుచుకోవచ్చు, మీ ప్రొడక్టివిటీని డబుల్ చేసుకోవచ్చు.
ఉపయోగాలు | Uses
సమయం సరిగా వాడుకోవచ్చు:
మనం ఎంత బిజీగా ఉన్నా, ఈ యాప్స్ ద్వారా సమయాన్ని సరిగ్గా ప్లాన్ చేసుకుని మన పనులు టైమ్‌కే పూర్తి చేసుకోవచ్చు.
ఈ యాప్స్ ఉపయోగించి మన పనులను సులభంగా మేనేజ్ చేయగలిగితే, పని తక్కువగా చేయొచ్చు కానీ ఫలితం ఎక్కువగా పొందొచ్చు.
ఈ యాప్స్ మనకు పనిలో చిత్తశుద్ధి, సమయానికి పనులు పూర్తి చేయడం వంటి లక్షణాలను సెట్ చేయడం లో సహాయపడతాయి.
ఈ యాప్స్ ద్వారా మన పర్సనల్ మరియు ప్రొఫెషనల్ పనులను సమానంగా మేనేజ్ చేయొచ్చు.
ఎలా ఉపయోగించాలి:
Download: ప్రతి యాప్‌ని గూగుల్ ప్లే స్టోర్ లేదా యాపిల్ యాప్ స్టోర్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
Set Up: మొదటిసారి యాప్ ఓపెన్ చేస్తే, ఒక అకౌంట్ క్రియేట్ చేయమని అడుగుతుంది. అప్పుడు మన ఇమెయిల్ లేదా సోషల్ మీడియా అకౌంట్ ద్వారా సైన్ అప్ చేయొచ్చు.
Details Fill:ఏ యాప్ అయినా మొదటిసారి వాడేటప్పుడు మన పనులు, ప్రాజెక్ట్స్ గురించి కొన్ని డీటెయిల్స్ అడుగుతుంది. వాటిని ఫిల్ చేసి, మన అవసరాలకు తగ్గట్టు సెట్ చేయొచ్చు.
Daily Use: యాప్‌ని ఒక్కసారి సెట్ చేసాక, దాన్ని రేగ్యూలర్‌గా వాడటం చాలా ముఖ్యం. అప్పుడే మనకి ప్రొడక్టివిటీ ఇంప్రూవ్ అవుతుంది.
ఫైనల్ గా చెప్పాలంటే: ప్రస్తుత కాలంలో,మనకు ఉన్న ఈ బిజీ లైఫ్‌లో కూడా మన పనులు సమయానికి పూర్తి చేసుకోవాలంటే, ప్రొడక్టివిటీ యాప్స్ చాలా అవసరం. ఈ 7 యాప్స్ మనం సరిగా వాడుకుంటే, మన ప్రొడక్టివిటీ డబుల్ అవుతుంది. సో, ఇంకెందుకు ఆలస్యం? ఇప్పుడే ఈ యాప్స్ డౌన్‌లోడ్ చేసుకుని వాడటం మొదలు పెట్టండి.